పాజిటివ్ బజ్ తో బరిలోకి దిగుతున్న నాని, అఖిల్ !

పెద్ద సినిమాల సందడి మొదలైంది. రేపు 21న నాని నటించిన ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’, 22న ‘హలో’ సినిమాలు రిలీజ్ కానున్నాయి. కేవలం ఒక్క రోజు వ్యవధిలో రిలీజ్ కానుండటంతో ఈ రెండు సినిమాల మధ్య గట్టి పోటీ నెలకొంది. నాని వరుస విజయాలతో ఉండటం, ఆయన కథా ఎంపికపై ప్రేక్షకుల్లో గట్టియు నమ్మకం ఉండటంతో ప్రీ రిలీజ్ బజ్ పాజిటివ్ గానే ఉంది. అంతేగాక అడ్వాన్స్ బుకింగ్స్ లో కూడా ‘ఎం.సి.ఏ’ ముందంజలో ఉంది.

అలాగే అఖిల్ కు రీ లాంచ్ గా భావించబడుతున్న ‘హలో’ చిత్రంపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించడం, నాగార్జున పర్యవేక్షణలో సినిమా రూపుదిద్దుకోవడం, ఆడియో, ట్రైలర్ అన్నీ సక్సెస్ కావడంతో ఈ చిత్ర విజయంపై కూడా ఎలాంటి అనుమానాలు లేవు. మరి ఒకే తరహా పాజిటి బజ్ తో బరిలోకి దిగుతున్న ఈ రెండు చిత్రాల్లో ఏది పెద్ద విజయాన్ని అందుకుంటుందో చూడలాంటే ఇంకో రెండు రోజులు ఆగాల్సిందే.