కొత్త కొత్త రికార్డుల్ని తెరపైకి తెస్తున్నారు

Published on Jan 17, 2020 2:00 am IST

ఇంతకుముందు రోజుల్లో సినిమా రికార్డులు అంటే 100 రోజులు ఎన్ని సెంటర్లలో రన్ అయింది, ఎన్ని ఏరియాల్లో 50 రోజులు పూర్తి చేసుకుంది, సినిమా లైఫ్ టైమ్ కలెక్షన్లు ఎంత, ఎన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ దొరికింది, ఏ రీజియన్ నుండి అత్యధిక వసూళవసూళ్లు వచ్చాయి వంటి లెక్కలు వేసుకునేవారు. కానీ ఇప్పుడు ఇలాంటి లాంగ్ టర్మ్ లెక్కల్ని పక్కనబెట్టేసి షాట్ టర్మ్ రికార్డ్స్ వెతుక్కుంటున్నారు.

టీజర్, ట్రైలర్లు ఎంత తక్కువ సమయంలో ఎన్ని వ్యూస్, లైక్స్ సాధించింది, ట్విట్టర్లో ఎంతసేపు ట్రెండ్ అయిందో వంటి చిత్రమైన రికార్డులు మొదలుకుని డే బై డే వసూళ్ల లెక్కలు చూసుకుని పోటీపడుతున్నారు. నాన్ బాహుబలి 2 రికార్డ్స్ అంటూ బెంచ్ మార్క్ పెట్టుకుని సింగిల్ షో కలెక్షన్లలో రికార్డుల్ని వెతుకుతున్నారు. ఈ సంక్రాంతికి విడుదలైన రెండు సినిమాలకు సంభందించిన ట్రేడ్ ట్రాకింగ్ వర్గాలు నాన్ బాహుబలి 2 ఫస్ట్ డే, సెకండ్ డే అంటూ రోజువారీ వసూళ్లను కూడా రికార్డుల కిందికి తీసుకురావడమే కాకుండా నాన్ బాహుబలి 2 నూన్ షో, నాన్ బాహుబలి 2 మార్నింగ్ షో కలెక్షన్స్ అంటూ కొత్త రికార్డుల్ని చెబుతున్నారు. దీంతో జనం సైతం ఇవేం రికార్డులు బాబోయ్ అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.

సంబంధిత సమాచారం :

X
More