హిట్ డైరెక్టర్ కి సినిమా సెట్ అయినట్టే !

Published on Feb 26, 2020 6:13 pm IST


మాస్ మహరాజా రవితేజ వరుస సినిమాలను అంగీకరిస్తున్నారు. రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ రాసిన కథతో, ‘నేను లోకల్’ ఫేమ్ నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో రవితేజ సినిమా చేస్తున్నాడు. పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఈ సినిమాని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. నక్కిన త్రినాధరావు సినిమా ఎప్పుడో స్టార్ట్ అవ్వాల్సింది. కానీ, కొన్ని కారణాలు వల్ల ఆలస్యం అయింది.

ఇక రవితేజ కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేవలం తన మాడ్యులేషన్ తోనే అద్భుతమైన కామెడీని పండించగలడు. అయితే కిక్ తరువాత రవితేజ మళ్లీ ఆ రేంజ్ కామెడీ సినిమా చెయ్యలేదు. అయితే తాజాగా రవితేజ అలాంటి కామెడీ సినిమాతోనే ఈ సారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడట.

కాగా ఈ సినిమా ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఉంటుందని… సినిమాలో రవితేజ క్యారెక్టరైజేషన్ మంచి కామెడీ టైమింగ్ తో అద్భుతంగా ఉంటుందని సమాచారం. త్రినాథరావ్ నక్కిన గత చిత్రాలు కూడా ‘సినిమా చూపిస్తా మామ’ ‘నేను లోకల్ వంటి సినిమాలు మంచి ఎంటెర్టైమెంట్ తో సాగిన విషయం తెలిసిందే. అన్నట్టు రవితేజ రమేష్ వర్మ డైరక్షన్ లోనూ ఓ సినిమా చేస్తున్నాడు. అయితే రమేష్ వర్మ సినిమా కంటే కూడా త్రినాథరావ్ నక్కిన సినిమానే ముందు మొదలవుతుందట,

సంబంధిత సమాచారం :

X
More