‘స్పిరిట్’పై త్రిప్తి కామెంట్స్.. ఏమందంటే..?

‘స్పిరిట్’పై త్రిప్తి కామెంట్స్.. ఏమందంటే..?

Published on Jul 2, 2026 8:01 AM IST

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘స్పిరిట్’ చిత్రంపై హీరోయిన్ త్రిప్తి దిమ్రి తాజాగా కొన్ని కామెంట్స్ చేసింది. ఈ ప్రాజెక్ట్ చాలా స్పెషల్‌గా ఉండబోతుందని, ఇప్పుడే వివరాలు చెప్పలేనప్పటికీ ప్రేక్షకులు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని పేర్కొంది.

ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ప్రభాస్ సరసన త్రిప్తి హాట్ లుక్‌లో కనిపించింది. దీంతో ఈ సినిమాలో ఆమె గ్లామర్ డోస్ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రలు పోషిస్తుండగా, హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు.

మరోవైపు, ప్రముఖ ఇంటర్నేషనల్ బ్రాండ్ ‘విక్టోరియాస్ సీక్రెట్’ ఇండియాకు మొదటి భారతీయ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికై త్రిప్తి సరికొత్త రికార్డ్ సృష్టించింది. చిన్నప్పుడు టీవీలో చూసి మురిసిపోయిన బ్రాండ్‌కే ఇప్పుడు అంబాసిడర్ కావడం పర్సనల్‌గా, ప్రొఫెషనల్‌గా తనకు ఎంతో స్పెషల్ అని ఈ బాలీవుడ్ బ్యూటీ ఆనందం వ్యక్తం చేసింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు