త్రిషకి ట్విట్టర్ లో 1 మిలియన్ ఫాలోవర్స్

త్రిషకి ట్విట్టర్ లో 1 మిలియన్ ఫాలోవర్స్

Published on Sep 26, 2014 4:02 AM IST

trisha

ఒకప్పుడు సౌత్ ఇండియన్ స్టార్ హీరోలనదరితోనూ నటించి, ప్రేక్షకుల కలల రాణిగా వెలుగొందిన త్రిష ప్రస్తుతం సినిమాలు చేయడంలో కాస్త స్లో అయ్యిందనే చెప్పాలి. కానీ సోషల్ మీడియాలో మాత్రం తనకి ఇంకా ఫాలోయింగ్ అస్సలు తగ్గలేదు. ఎందుకంటే తాజాగా త్రిష ట్విట్టర్ అకౌంట్ లో 1 మిలియన్ ఫాలోవర్స్ క్రాస్ అయ్యారు. ఇప్పుడు స్టార్ ఇమేజ్ లో ఉన్న చాలా మందికి దక్కని ఈ ఫాలోయింగ్ త్రిషకి దక్కింది.

దేన్నిబట్టి చూసుకుంటే త్రిషకి సినిమా అవకాశాలు తగ్గాయే తప్ప ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం అస్సలు తగ్గలేదు. త్రిష ఇటీవలే కన్నడలో చేసిన ‘పవర్’ సినిమాతో సూపర్ హిట్ అందుకొని ఫుల్ ఫాంలోకి వచ్చింది. త్రిష ప్రస్తుతం తెలుగులో బాలకృష్ణ సరసన ఓ సినిమాలో నటిస్తోంది, అలాగే తమిళంలో అజిత్ సరసన ఓ సినిమాలో నటిస్తోంది.

తాజా వార్తలు