
గత దశాబ్ద కాలంగా సౌత్ ఇండియన్ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ వస్తున్న అందాల భామ త్రిషకి పెళ్లి అని తెలియగానే ఎంతో మంది అభిమానుల హృదయాలు ముక్కలైపోయాయి. త్రిష ఇండస్ట్రియలిస్ట్ అయిన వరుణ్ మనియన్ ని ప్రేమించింది. వీరిద్దరి నిశ్చితార్ధం జనవరి 23న జరిగింది. ఇది జరిగిన కొద్ది రోజులకే త్రిష – వరుణ్ ల లైఫ్ లో ఓక బాధాకరమైన విషయం చోటు చేసుకుంది. అదే కొంతమంది ఆగంతకులు వరుణ్ కి ఫోన్ చేసి చంపేస్తాం అని బెదిరించడం..
అసలు విషయంలోకి వెళితే ఈ సంవత్సరం చెన్నై ఐపిఎల్ టీం అయిన చెన్నై సూపర్ కింగ్స్ టీంతో అసోషియేట్ అవ్వడానికి వరుణ్ ట్రై చేస్తున్నాడు. కానీ గుర్తు తెలియని కొంతమంది రెగ్యులర్ గా వరుణ్ కి ఫోన్ చేసి చెన్నై సూపర్ కింగ్స్ తో అసోషియేట్ అవ్వవద్దని వార్నింగ్ ఇస్తున్నారు. ఒకవేళ ఆలా ప్రాణానికే ప్రమాదం అని వార్నింగ్ ఇస్తున్నారు. గతంలో చెన్నై సూపర్ కింగ్స్ టీంలో కొన్ని మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారాలు జరిగాయి. దాంతో ఈ ఫోన్ కాల్స్ కి మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ విషయంపై చేయగా ప్రస్తుతం చెన్నై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.