అరుదైన రికార్డు నెలకొల్పిన త్రిష సినిమా!

trisha
త్రిష, హన్సిక, సిద్ధార్థ్‌లు ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా తమిళంలో ‘అరన్‌మనై 2’ పేరుతో ఓ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. హన్సిక లీడ్ రోల్‌లో నటించిన హర్రర్ కామెడీ ‘అరన్‌మనై’కు సీక్వెల్‌గా ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే క్రేజీ కాంబినేషన్‌తో తమిళంలో ఆసక్తికరంగా మారిన ఈ సినిమా, తాజాగా ఆసియాలోనే ఓ సరికొత్త రికార్డు సృష్టించింది.

వివరాల్లోకి వెళితే అరన్‌మనై సినిమా క్లైమాక్స్ పాట కోసం సినిమా యూనిట్ ఒక అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించాలి. మొదట గ్రాఫిక్స్‌ విభాగంతో కలిసి పనిచేసి విగ్రహాన్ని పెద్దగా ఉన్నట్లు చూపించాలనే ప్రయత్నం చేసినా, ఆర్ట్ డైరెక్టర్ గురురాజ్ మాత్రం విగ్రహాన్ని తయారు చేస్తేనే బాగుంటుందని, తన టీమ్‌తో కలిసి నలభై రోజులు శ్రమించి 103 అడుగుల విగ్రహాన్ని తయారుచేశారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో పాటు కొన్ని ఇతర మిశ్రమాలతో రూపొందిన విగ్రహం ఆసియాలోనే రికార్డుగా నిలవనుంది. ఇక ఈ రికార్డు త్వరలోనే లిమ్కా బుక్‌లోనూ స్థానం సంపాదించుకోనుంది. సుందర్ సీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

Exit mobile version