
గత రెండు మూడు ఏళ్ళ నుండి త్రిషకు తెలుగు, తమిళ భాషల్లో సరైన విజయం లేదు. పెద్ద హీరోల సరసన నటించిన ‘తీన్ మార్’, ‘దమ్ము’, ‘సమర్’.. ఇలా అన్ని ఆశించిన విజయాన్ని అందించలేదు. దాంతో, సరైన అవకాశాలు లభించకపోవడంతో పెళ్లి చేసుకుంటుందని కొందరు విమర్శించారు. తాజాగా విడుదలైన తమిళ సినిమా ‘ఎన్నై ఆరిందాల్’తో విమర్శలకు చెక్ పెట్టింది. 2015లో ఫస్ట్ హిట్ కొట్టింది. పెళ్ళికి ముందు త్రిషకు సక్సెస్ ను గిఫ్ట్ గా ఇచ్చారు తమిళ ప్రేక్షకులు.
తెలుగులో ఈ సినిమా ‘ఎంతవాడు గాని’ పేరుతో విడుదల కానుంది. అజిత్ హీరోగా నటించిన ఈ సినిమాకు గౌతమ్ మీనన్ దర్శకుడు. అనుష్క మరొక హీరోయిన్. దర్శకుడు అనుష్కను మదిలో పెట్టుకుని రాసుకున్న పాత్ర త్రిషకు బాగా నచ్చడంతో, హీరోయిన్ల క్యారెక్టర్లు మారాయి. త్రిష ఆ పాత్రలో అద్బుతంగా నటించిందని అందరు ప్రశంసిస్తున్నారు.
తెలుగులో బాలకృష్ణ సరసన త్రిష నటిస్తున్న ‘లయన్’ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మార్చి నెలాఖరులో ఈ సినిమా విడుదల కానుంది. తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకోవాలని ఆశిద్దాం.

