త్రివిక్రమ్ , నాని కలిసి సినిమా చెయ్యబోతున్నారా ?
Published on Mar 1, 2018 10:04 am IST

వరుస సక్సెస్ ఫుల్ సినిమాలతో దూసుకెళ్తున్న నాని ప్రస్తుతం మెర్లపాక గాంధీ దర్శకత్వంలో నటిస్తున్నాడు. అనుపమ పరమేశ్వరన్, రుక్షర్ మీర్ హీరోయిన్స్ గా నటిస్తోన్న ఈ సినిమా ఏప్రిల్ రెండోవారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జెంటిల్ మెన్ సినిమా తరువాత నాని ద్విపాత్రభినమం చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమా తరువాత నాని చేయబోయే సినిమాపై వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం ఎన్టీఆర్ తో సినిమా చేస్తోన్న త్రివిక్రమ్ త్వరలో నానితో సినిమా చెయ్యబోతున్నట్లు తెలిస్తోంది. ఎన్టీఆర్ సినిమా పూర్తి అయ్యేక త్రివిక్రమ్ వెంకటేష్ తో సినిమా ఉంది. హారిక హాసిని బ్యానర్ లో తెరకెక్కబోయే ఈ సినిమాను ఆఫీషియల్ గా అనౌన్స్ చేశారు. మరి ఎన్టీఆర్ సినిమా తరువాత త్రివిక్రమ్ నానితో చేస్తాడా వెంకటేష్ తో చేస్తాడో చూడాలి. అధికారికంగా వార్తా వచ్చే వరకు ఈ న్యూస్ ను నమ్మలేం.

 
Like us on Facebook