పవన్ రీమేక్‌కి మాటల మాంత్రికుడి సజేషన్స్..!

Published on Jul 11, 2021 3:00 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-రానా దగ్గుబాటి హీరోలుగా మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియం’ మూవీనీ సాగర్ కె చంద్ర తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు మాటల మాంత్రికిడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే మరియు డైలాగ్స్ అందిస్తున్నారు. అయితే సీరియస్ డ్రామాగా సాగే ఈ మలయాళ సినిమాలో సాంగ్స్ పెద్దగా ఉండవు, ఎక్కువ భాగం బ్యాగ్రౌండ్ స్కోర్‌తోనే కథను నడిపించేశారు.

అయితే తెలుగులో పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడు కాబట్టి ఆయన అభిమానులు పాటలను ఖచ్చితంగా కోరుకుంటారు. ఈ విషయంలోనే దర్శక నిర్మాతలకు త్రివిక్రమ్ కొన్ని సజేషన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్‌కి ఉన్న ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే స్క్రిప్ట్ లో పలు మార్పులు చేర్పులు చేసిన త్రివిక్రమ్ అదనంగా సాంగ్స్ మాత్రం వద్దని సూచించారట. సీరియస్ డ్రామాలో పాటలు పెడితే అవి సినిమా మొత్తంపై ప్రభావం చూపే అవకాశం ఉందని సలహా ఇచ్చారట. దీంతో చిత్రంలో గరిష్టంగా రెండు లేదా మూడు పాటలు మాత్రమే ఉంటాయని అవి కూడా కథలో భాగంగానే ఉండబోవొచ్చని టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో పవన్ ఓ ఫోక్ సాంగ్‌ను పాడబోతున్నారని, దీనికి థమన్ మంచి ట్యూన్ సమకూర్చినట్లు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :