త్రివిక్రమ్.. ఆ హీరోయిన్ విషయంలో కూడా.. !

Published on Feb 27, 2019 6:10 pm IST

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తన తరువాత చిత్రాన్ని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో చేయబోతున్న విషయం తెలిసిందే. ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రాల విజయాల తరువాత వీరిద్దరూ కలిసి మూడోసారి చేస్తోన్న సినిమా కావడంతో.. ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.

కాగా ఈ సినిమాలో బన్నీ సరసన నటించే హీరోయిన్నీ ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు త్రివిక్రమ్. దాదాపు పూజా హెగ్డేకే త్రివిక్రమ్ ఫిక్స్ అయ్యాడని తెలుస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో బన్నీ దేవిశ్రీ ప్రసాద్ వైపు మొగ్గు చూపగా, త్రివిక్రమ్ మాత్రం పట్టు బట్టి తమన్ నే పెట్టుకున్నాడు. ఇప్పుడు హీరోయిన్ విషయంలో కూడా త్రివిక్రమ్ అలాగే బిహేవ్ చేస్తోన్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ ను కాస్త వైవిధ్యంగా చూపించనున్నాడు త్రివిక్రమ్. అందుకు తగ్గట్లుగానే త్రివిక్రమ్ సూచన మేరకు బన్నీ కాస్త వెయిట్ తగ్గుతున్నాడట. అలాగే హెయిర్ స్టైల్ కూడా మార్చబోతున్నాడట. ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో కూడా బన్నీ మాడ్యులేషన్ని కాస్త కొత్తగా మార్చాడు త్రివిక్రమ్. మరి ఈ సినిమాలో బన్నీలో ఏం కొత్తగా చూపిస్తాడో చూడాలి.

సంబంధిత సమాచారం :