ఎన్టీఆర్ స్క్రిప్ట్ కి బెటర్మెంట్ ట్రై చేస్తున్న త్రివిక్రమ్

ఎన్టీఆర్ స్క్రిప్ట్ కి బెటర్మెంట్ ట్రై చేస్తున్న త్రివిక్రమ్

Published on Apr 23, 2020 11:20 AM IST

కరోనా లాక్ డౌన్ అందరినీ ఇంటికే పరిమితం చేసింది. బోరుకొట్టినా బాధనిపించినా ఇంట్లోనే ఉండాలి. లేకపోతే కరోనాకి బలికాక తప్పదు. ఇక ప్రముఖులు సైతం లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ సామాన్యులలో అవగాహన కల్పిస్తున్నారు. కాగా డైరెక్టర్ త్రివిక్రమ్ ఎన్టీఆర్ మూవీ స్క్రిప్ట్ కి బెటర్మెంట్ కోసం ట్రై చేస్తున్నారట. ఎన్టీఆర్ 30వ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్న త్రివిక్రమ్ ఇప్పటికే ఆ మూవి స్క్రిప్ట్ లాక్ చేయడం జరిగింది. ఐతే కరోనా కారణంగా ఖాళీ సమయం దొరికిన నేపథ్యంలో, సన్నివేశాలు, డైలాగ్స్ విషయంలో మరింత బెటర్మెంట్ మరియు క్వాలిటీ వచ్చేలా మెరుగులు దిద్దుతున్నారట. ముఖ్యంగా తన మార్కు కామెడీ పంచెస్, సెంటిమెంట్ పై ఎక్కువ ఫోకస్ చేస్తున్నారట.

గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత ఎన్టీఆర్ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. దీనితో ఈ చిత్రంపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలున్నాయి. ఇక హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మే నెలలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లాల్సివుంది. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ మూవీ విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు