‘మాస్ స్ట్రైక్’..మహేష్ తో త్రివిక్రమ్ ఊహించని మాస్ సంభవం.!

Published on May 27, 2023 9:15 am IST


ప్రస్తుతం మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ తో అయితే తమ కాంబోలో చేస్తున్న హ్యాట్రిక్ సినిమా కోసం తెలిసిందే. దీనిపై కూడా సెన్సేషనల్ హైప్ ఉంది. మరి మహేష్ కోసం త్రివిక్రమ్ ఈసారి మరికాస్త కొత్తగా ట్రై చేస్తుండగా ఈ మే 31 ట్రీట్ కోసం అయితే ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ ట్రీట్ కి ముందు అయితే మేకర్స్ ఈరోజు ఓ సాలిడ్ అప్డేట్ ఇస్తున్నట్టుగా మేకర్స్ అనౌన్స్ చేశారు.

మరి ఈ సాలిడ్ అప్డేట్ అయితే ఇప్పుడు మేకర్స్ రివీల్ చేశారు. మరి ఓ ప్రీ లుక్ పోస్టర్ అన్నట్టుగా మహేష్ పై ఓ సూపర్ మాస్ పోస్టర్ ని మేకర్స్ ఇప్పుడు వదిలారు. చేతిలో బీడీ పెట్టుకొని తలకి ఎర్ర తువ్వాలుతో మహేష్ తో అయితే త్రివిక్రమ్ ఊహించని మాస్ సంభవంనే ప్లాన్ చేస్తున్నారని చెప్పాలి. మరి మాస్ స్ట్రైక్ అంటూ ఈ మే 31కి అయితే ఫ్యాన్స్ కి అదిరే ట్రీట్ ని ప్లాన్ చేస్తున్నట్టుగా ఈ పోస్టర్ తో కన్ఫర్మ్ చేశారు. ఇక ఆరోజు హైప్ ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :