“వరుడు కావలెను” ఓ ఆడపిల్ల తాలుకు కథ – త్రివిక్రమ్

Published on Oct 28, 2021 3:02 am IST


యంగ్ హీరో నాగ శౌర్య, రీతూ వర్మ జంటగా లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం “వరుడు కావలెను”. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 29న రిలీజ్ కాబోతుంది. అయితే తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ హాజరయ్యాడు.

ఈ సందర్భంగా మాట్లాడిన త్రివిక్రమ్ మాట్లాడుతూ రేపు ఈ సినిమా నుంచి మరో సాంగ్ వస్తుందని, మీకు అందరికి ఆ పాట కూడా నచ్చుతుందని అన్నారు. ఈ సినిమాను నేను చూశానని, ముందు సినిమా చూడగానే కెమెరామెన్ వంశీ పచ్చి పులుసుకు కంగ్రాట్స్ చెప్పాలని అనిపించిందని అన్నాడు. నాగ శౌర్య, రీతూ, నదియా, మురళీ శర్మ అందరికి వారి వారి పాత్రలు గుర్తుండిపోతాయని, డైలాగ్ రైటర్ గణేశ్‌కి కూడా కంగ్రాట్స్ అని అన్నారు.

ఈ కథ మన ఇంట్లో జరిగే ఓ ఆడపిల్ల తాలుకు కథ అని, లక్ష్మీ సౌజన్య చాలా మంచి కథను ఎంచుకున్నారని అన్నారు. సినిమాలో దిగు దిగు నాగ పాట అందరికీ నచ్చిందని, సినిమా ప్లాష్ బ్యాక్‌లో విశాల్ చేసిన ఓ సాంగ్ కూడా చాలా చాలా బాగుంటుందని త్రివిక్రమ్ అన్నాడు. హీరోయిన్ రీతూ వర్మ ఈ సినిమా మొత్తం చీరలోనే కనిపించిందని, నా సినిమాల్లో చినబాబు గారు హీరోయిన్ చీర కట్టుకోలేదని బాధపడే వాడని, ఈ సినిమా ద్వారా ఆయన కోరిక తీరిందని అన్నాడు.

అయితే కరోనా కారణంగా ఈ సినిమా ఏడాదిన్నరకు పైగా లేట్ అయ్యిందని ఇంతలా వెయిట్ చేసిన ఎంటైర్ చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు తెలియచేస్తున్నానని, ఇక్కడికి వచ్చిన బన్నీ గారికి, ఆయన అభిమానులకు థ్యాంక్స్ అని అన్నాడు.

సంబంధిత సమాచారం :

More