‘బాహుబలి’ టీం హార్డ్ వర్క్ పై త్రివిక్రమ్ కామెంట్స్

‘బాహుబలి’ టీం హార్డ్ వర్క్ పై త్రివిక్రమ్ కామెంట్స్

Published on Apr 12, 2015 5:54 PM IST

Trivikram-srinivas
టాలీవుడ్ రేంజ్ ని వరల్డ్ సినిమాకి పరిచేస్ రీతిలో తెరకెక్కుతున్న సినిమా ‘బాహుబలి’. ఎస్ఎస్ రాజమౌళి అతని టీం గత రెండున్నర సంవత్సరాలుగా ఎంతో కష్టపడి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టీంపై మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రశంశల జల్లు కురిపించాడు. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ‘S/O సత్యమూర్తి’ సినిమా గత వారం విడుదలై మంచి కుటుంబ కథా చిత్రం గా పేరు తెచ్చుకుంటోంది.

ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రాజమౌళిలా పీరియాడికల్ సినిమా మరియు ఇతర భాషల్లో సినిమా రిలీజ్ చేయాలని అనుకోవడం లేదా అని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ‘ఎవరో తీస్తున్నారు కదా నేనూ అలాంటి సినిమా చెయ్యను. నాకు నచ్చిన కథ చేస్తాను. రాజమౌళి ఎంచుకునే కథలు అలా ఉంటాయి. అందుకే అంత బడ్జెట్ పెట్టి, ఎంతో కష్టపడి సినిమా చేస్తారు. ఆ కథలని అలానే తీయాలి. బాహుబలి కోసం రాజమౌళి టీం ఎంతో కష్టపడ్డారు. ఇక ఇతర భాషల్లో రిలీజ్ అంటారా.. ఎప్పుడైతే మనం చెప్పే కథకి యూనివర్సల్ అప్పీల్ ఉంటుందో అప్పుడే ఆ మూవీని మల్టిపుల్ లాంగ్వేజస్ లో రిలీజ్ చెయ్యగలం. ఈగ, బాహుబలి సినిమాలు యూనివర్సల్ కాన్సెప్ట్స్ తో వస్తున్నవి, అందుకే అవి మల్టిపుల్ లాంగ్వేజస్ లో రిలీజ్ అవ్వడం కరెక్ట్ అని’ అన్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు