‘ట్రూ లవర్’ శాటిలైట్ & ఓటిటి పార్ట్నర్స్ లాక్

‘ట్రూ లవర్’ శాటిలైట్ & ఓటిటి పార్ట్నర్స్ లాక్

Published on Feb 11, 2024 12:00 AM IST


గుడ్ నైట్ మూవీ ఫేమ్ మణికందన్ హీరోగా శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్ గా ప్రభురామ్ వ్యాస్ రచన, దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ రొమాంటిక్ యాక్షన్ లవ్ మూవీ ట్రూ లవర్. ఈ మూవీని తెలుగులో ఎస్ కె యెన్, డైరెక్టర్ మారుతీ కలిసి సంయుక్తంగా రిలీజ్ చేస్తున్నారు.

టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ట్రూ లవర్ మూవీ నేడు ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. మ్యాటర్ ఏమిటంటే, ఈ మూవీ యొక్క శాటిలైట్ మరియు ఓటిటి పార్ట్నర్స్ లాక్ అయ్యాయి.

ఈ మూవీ శాటిలైట్ హక్కుల్ని ప్రముఖ టెలివిజన్ ఛానల్ స్టార్ మా, అలానే ఓటిటి హక్కుల్ని డిస్నీ హాట్ స్టార్ ప్లస్ వారు సొంతము చేసుకున్నారు. ఇంకా ఈ మూవీలో కన్న రవి, శరవణన్, గీతా కైలాసం, హరీష్ కుమార్, నిఖిలా శంకర్, రిని కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు