చరణ్.. నీకు ఎప్పటికీ మరచిపోలేని సర్ ప్రైజ్ – ఎన్టీఆర్

Published on Mar 26, 2020 8:14 pm IST

రేపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు. చరణ్ బర్త్ డే వేడుకలను ఆయన అభిమానులు ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తారు.కానీ ‘కరోనా’ నేపథ్యంలో ఈ సంవత్సరం ఎటువంటి ఆర్భాటాలు వద్దని ఫ్యాన్స్ కు చచరణ్ ఇప్పటికే స్పష్టం చేశాడు. అయితే ఎన్టీఆర్ మాత్రం చరణ్ కి అదిరిపోయే సర్ ప్రైజ్ ప్లాన్ చేశాడు. ఈ విషయం గురించి ఎన్టీఆర్ ట్వీట్ చేస్తూ.. ‘బ్రదర్ రామ్ చరణ్ .. ఐ విష్.. నేను నీ బర్త్ డేను మంచి పరిస్థితులలో జరుపుకున్నాం. కానీ మనం లాక్ డౌన్ లో ఉన్నాము కాబట్టి ఇంట్లో ఉండటం ముఖ్యం. అందుకే రేపు ఉదయం 10 గంటలకు నేను నీకు డిజిటల్ సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నాను. నన్ను నమ్ము.. ఇది నీకు ఎప్పటికీ మరచిపోలేని బ్యాంగ్’ అని ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. దానికి చరణ్ కూడా బాగా ఎగ్జైటింగ్ గా వావ్.. వెయిట్ చేయలేను అంటూ రిప్లే ఇచ్చాడు.

ఇక ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజులా, తారక్ కొమరం భీంలా నటిస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో రూపొందిస్తున్నాడు. ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ‘బాహుబలి’ సిరీస్ అనంతరం రాజమౌళి చేస్తున్న ప్రాజెక్ట్ కావడం, పైగా ఇద్దరు స్టార్ హీరోలతో పాటు బాలీవుడ్ స్టార్స్ కూడా కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా పై ఆరంభం నుండి భారతీయ అన్ని సినీ పరిశ్రమల్లో అత్యున్నత భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :

X
More