‘టక్ జగదీశ్’ రిలీజ్‌పై అటో ఇటో తేల్చుకోబోతున్నారు..!

Published on Aug 5, 2021 1:00 am IST

నేచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సినిమా ‘టక్ జగదీష్’. ఈ సమ్మర్‌లోనే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా లాక్‌డౌన్ కారణంగా వాయిదాపడిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల సినిమా థియేటర్లు మళ్లీ తెరుచుకోవడంతో ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్‌పై మూవీ లవర్స్‌లో ఒకింత ఆసక్తి నెలకొంది. అయితే ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతుందని మొదట్లో బాగా ప్రచారం జరిగింది. కానీ ఈ సినిమాను ఖచ్చితంగా థియేటర్లలోనే రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ చెప్పడం, ఇటీవల జరిగిన “తిమ్మరుసు” మూవీ ప్రీరిలీజ్‌ వేడుకలో నాని థియేటర్ వ్యవస్థపై మాట్లాడిన విధానం చూశాక టక్ జగదీశ్ ఖచ్చితంగా థియేటర్లలోనే రిలీజ్ అవుతుందన్న నమ్మకం అందరిలో కలిగింది.

అయితే “టక్ జగదీశ్” డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కోసం అమెజాన్ ప్రైమ్ 45 కోట్లు ఆఫర్ చేసినట్టు తాజా సమాచారం. దీంతో గురువారం నాడు చిత్రం బృందం నిర్వహిస్తున్న సమావేశంలో “టక్ జగదీశ్”ను ఓటీటీలో రిలీజ్ చేయాలా? థియేటర్లలో రిలీజ్ చేయాలా? అనేది అటో ఇటో తేల్చేయనున్నారు. వీలైతే ఈ సమావేశంలోనే రిలీజ్ డేట్‌పై కూడా నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ముందునుంచి చెబుతున్నట్టు మేకర్స్ “టక్ జగదీశ్”ను థియేటర్లలో రిలీజ్ చేసేందుకే మొగ్గు చూపుతారో లేక టర్న్ తీసుకుని ఓటీటీ వైపు ఆసక్తి చూపుతారో అనేది చూడాలి మరీ.

సంబంధిత సమాచారం :