టక్ జగదీశ్ నుండి టక్ సాంగ్ విడుదల!

Published on Sep 3, 2021 4:00 pm IST


న్యాచురల్ స్టార్ నాని హీరోగా, రీతూ వర్మ హీరోయిన్ గా శివ నిర్వాణ దర్శకత్వం లో తెరకెక్కిన తాజా చిత్రం టక్ జగదీష్. ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ గా డైరెక్ట్ అమెజాన్ ప్రైమ్ వీడియో లో విడుదల కానున్న సంగతి అందరికీ తెలిసిందే. వినాయక చవితి శుభాకాంక్షల తో ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 10 వ తేదీన చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

ఈ చిత్రం నుండి ఇప్పటికే ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. ఈ చిత్రం ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకోవడం మాత్రమే కాకుండా కుటుంబ ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంది. ఈ చిత్రం కి సంబంధించిన ఒక పాటను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేయడం జరిగింది. టక్ సాంగ్ గా వచ్చిన ఈ పాట ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. ఈ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తున్నారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గోపి సుందర్ అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని సాహు గారపాటి మరియు హరీష్ పెద్ది లు షైన్ స్క్రీన్స్ పతాకం పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రం లో జగపతి బాబు, ఐశ్వర్య రాజేష్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

పాటను చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :