13న సాయి కొర్రపాటి ‘తుంగ‌భ‌ద్ర’ ఆడియో..

13న సాయి కొర్రపాటి ‘తుంగ‌భ‌ద్ర’ ఆడియో..

Published on Feb 10, 2015 2:23 PM IST

tungabhadra
‘ఈగ’, ‘అందాల రాక్షసి’, ‘లెజెండ్’, ‘ఊహలు గుసగుసలాడే’, ‘దిక్కులు చూడకు రామయ్య’ చిత్రాలతో ఉత్తమ అభిరుచి గల నిర్మాతగా నిరూపించుకున్నారు సాయి కొర్రపాటి. తాజాగా వారాహి చలన చిత్రం బ్యానర్ నుండి వస్తున్న చిత్రం ‘తుంగభద్ర’.

అదిత్ అరుణ్, డింపుల్ చోపడే జంటగా నటించిన ఈ చిత్రంలో తమిళ నటుడు సత్యరాజ్ స‌త్యరాజ్ కీల‌క పాత్రలో నటించారు. శ్రీ‌నివాస కృష్ణ గోగినేని ద‌ర్శకుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ చిత్ర ఆడియోను ఫిబ్రవరి 13న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 26న చిత్రాన్ని విడుదల చేస్తారని సమాచారం. ప‌ల్లెటూరి రాజ‌కీయాల నేప‌థ్యంలో సాగే ఓ అంద‌మైన ప్రేమ‌క‌థ ఈ చిత్రాన్ని తెరకెక్కించారని చిత్ర బృందం నుండి వినిపిస్తున్న మాట.

తాజా వార్తలు