తెలుగు నటుడు కన్నుమూత !

Published on Apr 28, 2019 4:53 pm IST

తెలుగు నటుడు సుభాష్ చంద్రబోస్ అలియాస్ బోస్ గాంధీ ఇక లేరు. నాలుగు రోజుల క్రితం ఆయన కృష్ణానగర్ లోని తన నివాసంలో ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడ్డారు. దాంతో ఆయన తలకు తీవ్ర గాయమైంది. గాంధీ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న బోస్ నాలుగు రోజులపాటు మృత్యువుతో పోరాడి ఈ రోజు కన్నుమూసినట్లు డాక్టర్స్ ధ్రువీకరించారు.

పలువురి సినీ మరియు టీవీ ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు. బోస్ గాంధీ నిన్నే పెళ్లాడత, అల్లరి రాముడు, ఇడియట్, శివమణి వంటి చిత్రాల్లో నటించారు. అలాగే పలు టీవీ సీరియల్స్ లోనూ ఆయన నటించారు.

సంబంధిత సమాచారం :