వినూత్న ఆలోచనతో “ట్విస్ట్” మూవీ పోస్టర్ రిలీజ్..!

వినూత్న ఆలోచనతో “ట్విస్ట్” మూవీ పోస్టర్ రిలీజ్..!

Published on Jan 8, 2022 8:00 AM IST


మనూ రాయల్, మధుప్రియ హీరో హీరోయిన్లుగా వెంకట్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “ట్విస్ట్”. రాయల్ ఫిలిమ్స్ బ్యానర్‌పై నిర్మాత సి.రంగ నాయకులు నిర్మించిన ఈ చిత్రం యొక్క పోస్టర్‌ను తాజాగా రిలీజ్ చేశారు.

అయితే సినీ పరిశ్రమలో మునుపెన్నడూ లేని విధంగా పరిసర ఆటో యూనియన్ ప్రెసిడెంట్స్, లీడర్స్ చేతుల మీదుగా ఈ కార్యక్రమంలో పోస్టర్ విడుదల జరగడం విశేషం. ఈ సందర్భంగా ఆటో యూనియన్ లీడర్స్ మాట్లాడుతూ సినిమా బృందానికి మా సహకారం, ట్విస్ట్ సినిమాకి మా ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటాయని సినిమా విడుదలకు ఎదురు చూస్తున్నామని తెలిపారు.

ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ పోస్టర్‌ను ఇలా ఆటో యూనియన్ వారిచే రిలీజ్ చేయడం ఆనందమని సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధంగా ఉందని ప్రతి ఒక్కరు సినిమా చూసి ఆదరించాలని కోరారు. అయితే ఈ వినూత్న ప్రచార శైలిని ఎంచుకున్న “ట్విస్ట్” సినిమా బృందాన్ని చిత్ర పరిశ్రమ అభినందించడం గమనార్హం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు