లేటెస్ట్ : హిందీలో “సలార్” ఓటిటి పార్ట్నర్ & రిలీజ్ డేట్ ఫిక్స్.!

లేటెస్ట్ : హిందీలో “సలార్” ఓటిటి పార్ట్నర్ & రిలీజ్ డేట్ ఫిక్స్.!

Published on Feb 9, 2024 10:41 AM IST

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ భారీ యాక్షన్ డ్రామా “సలార్ సీజ్ ఫైర్” కోసం అందరికీ తెలిసిందే. మరి చాలా కాలం తర్వాత ప్రభాస్ రేంజ్ బాక్సాఫీస్ బ్లాస్ట్ గా నిలిచిన ఈ చిత్రం తర్వాత ఓటిటిలో కూడా వచ్చి అదిరే వసూళ్ళని రాబట్టింది. అయితే ఈ చిత్రం ఇంగ్లీష్ సహా పాన్ సౌత్ భాషల స్ట్రీమింగ్ హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకోగా.

హిందీ వెర్షన్ కూడా వీరే స్ట్రీమింగ్ కి తీసుకొస్తారని చాలా మంది అనుకున్నారు. అయితే ఇప్పుడు ఈ ఒక్క వెర్షన్ పై ట్విస్ట్ వచ్చింది. ఈ సినిమా హిందీ హక్కులని డిస్నీ+ హాట్ స్టార్ వారు అయితే కొనుగోలు చేయగా అందులో అతి త్వరలో రిలీజ్ కి తీసుకొస్తున్నట్టుగా హింట్ ఇచ్చారు. ఇక లేటెస్ట్ గా అయితే ఈ చిత్రం ఎప్పుడు వస్తుంది అనేది కూడా డేట్ ఇచ్చేసారు. దీనితో ఈ అవైటెడ్ సినిమా హిందీలో ఈ ఫిబ్రవరి 16 నుంచి స్ట్రీమింగ్ కి వస్తున్నట్టుగా ఖరారు చేశారు. మరి ఈ చిత్రాన్ని హిందీలో చూడాలి అనుకునేవారు అప్పుడు నుంచి చూడవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు