ట్విస్ట్: ‘పెద్ది’ ఈ వెర్షన్ రిలీజ్ రద్దు!?

ట్విస్ట్: ‘పెద్ది’ ఈ వెర్షన్ రిలీజ్ రద్దు!?

Published on Jun 3, 2026 1:53 PM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “పెద్ది” కోసం అందరికీ తెలిసిందే. మరికొన్ని గంటల్లో ప్రీమియర్స్ తో తెలుగు రాష్ట్రాల్లో మోత మోగనున్న ఈ చిత్రం ఒక బ్లాస్టింగ్ ఓపెనింగ్స్ పై ఇప్పుడు కన్నేసింది. అయితే ఇండియా వైడ్ గా పాన్ ఇండియా లెవెల్లో ఓలు భాషలు థియేటర్స్ లో పలు ఫార్మాట్ లలో విడుదల కాబోతున్న ఈ సినిమా విషయంలో ఓ ట్విస్ట్ ఇపుడు చోటు చేసుకుంది.

ఆడియెన్స్ ని ఎంతగానో అలరించే ఫార్మాట్ లలో 4డిఎక్స్ వెర్షన్ కూడా ఒకటి. మెయిన్ గా స్పోర్ట్స్ డ్రామా లాంటి సినిమాలు ఈ వెర్షన్ లలో చూసే ఆడియెన్స్ కి సూపర్ కిక్ ని అందిస్తాయి. పెద్ది సినిమాని కూడా ఈ ఫార్మాట్ లో మేకర్స్ ముందు అనౌన్స్ చేశారు కానీ ఇండియా వైడ్ గా ఈ వెర్షన్ పెద్ది రిలీజ్ బుకింగ్స్ ఎక్కడా కనిపించడం లేదు.

హైదరాబాద్ సహా ఇతర నార్త్ ముఖ్య నగరాల్లో కూడా పెద్ది చిత్రానికి బార్కో లేజర్, ఎపిక్, డాల్బీ సినిమా తదితర ఫార్మాట్ లు బుకింగ్స్ ఉన్నాయి కానీ 4డిఎక్స్ వెర్షన్ ని మాత్రం మిస్ చేశారు. సో ఈ ఫార్మాట్ పరంగా మాత్రం మేకర్స్ ట్విస్ట్ ఇచ్చారనే అనుకోవాలి. మరి తర్వాత అయినా దీనిని అప్డేట్ చేస్తారా లేదా అనేది చూడాలి.

తాజా వార్తలు