యువ హీరో అక్కినేని అఖిల్ ప్రస్తుతం తన లెనిన్ చిత్రాన్ని దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి (నందు) డైరెక్షన్ లో చేస్తున్నాడు. ఐతే, ఈ సినిమా కోసం రెండు క్లైమాక్స్ లను షూట్ చేస్తున్నారట. మొదటి క్లైమాక్స్ లో మాస్ ఎలిమెంట్స్ తో ఫుల్ “హీరోయిజం మూమెంట్స్” కూడా ఫుల్ గా ఉంటాయట. ఇక మరో క్లైమాక్స్ విషయానికి వస్తే.. కథలో ఊహించని మలుపు, ముఖ్యంగా హీరో పాత్ర తీసుకున్న నిర్ణయం చాలా కొత్తగా ఉంటుందని.. గ్రే షేడ్‌లో హీరో క్యారెక్టర్ టర్న్ అవ్వడం కూడా హైలైట్ గా ఉంటుందని తెలుస్తోంది. పైగా ఈ క్లైమాక్స్ లో సీక్వెల్‌కు హింట్ కూడా ఇస్తారట.
మరి ఈ రెండు క్లైమాక్స్ ల్లో చివరకు ఏ క్లైమాక్స్ ను ఫైనల్ చేస్తారో చూడాలి. కాగా ఈ సినిమా.. రాయలసీమ బ్యాక్ డ్రాప్ తో చిత్తూరు ప్రాంతం నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాలో అందాల భామ భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. ఇక సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా అఖిల్ – భాగ్య శ్రీ కలయికలో లవ్ సీన్స్ చాలా బాగుంటాయట. అన్నట్టు ఈ సినిమా పై అఖిల్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. సినిమా అవుట్ ఫుట్ అయితే బాగా వస్తోందని టీమ్ చెబుతుంది. మరి ఈ సినిమాతో అఖిల్ హిట్ కొడతాడో లేదో చూడాలి.
