హీరో అడివి శేష్ : ప్రస్తుతం చేస్తున్న రెండు చిత్రాలు పాన్ ఇండియా ఆడియన్స్ ని అద్భుతంగా అలరిస్తాయి

హీరో అడివి శేష్ : ప్రస్తుతం చేస్తున్న రెండు చిత్రాలు పాన్ ఇండియా ఆడియన్స్ ని అద్భుతంగా అలరిస్తాయి

Published on Dec 17, 2023 12:00 AM IST

యంగ్ డైనమిక్ హీరో అడివి శేష్ కెరీర్ లో వైవిధ్యమైన చిత్రాలతో వరుస బ్లాక్ బస్టర్ విజయాల్ని అందుకుంటూ పాన్ ఇండియా ఫేం సంపాదించుకున్నారు. హిట్ 2, మేజర్ లాంటి సెన్సేషనల్ హిట్స్ తర్వాత ప్రస్తుతం గూఢచారి 2, శృతి హాసన్ హీరోయిన్ గా అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న లాంటి మరో రెండు బిగ్గెస్ట్ పాన్ ఇండియా చిత్రాలతో ప్రేక్షకులని అలరించడానికి సిద్ధమౌతున్నారు శేష్. డిసెంబర్ 17 అడివి శేష్ పుట్టిన రోజు సందర్భంగా విలేకర్లతో ముచ్చటించారు అడివి శేష్.

మీ నుంచి 2023 లో ఒక్క సినిమా కూడా రాలేదనే ఫీలింగ్ ఉందా ?
అలాంటి పట్టింపు ఏమీ లేదండి. పేస్ బౌలర్స్ అందరికీ ఒకే స్పీడ్ వుండదు కదా. ప్రతి మనిషికి వాళ్ళ మాదిరిగా స్పీడ్ వుంటుంది. చేసింది బావుండాలి అదే ముఖ్యం. అయితే మేజర్, హిట్ 2 బ్యాక్ టు బ్యాక్ వచ్చినట్లు నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు చేస్తున్న రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ వస్తాయి.

మీ ప్రయాణం ఎక్కడి వరకూ వచ్చిందనేది అలోచిస్తుంటారా ?
జర్నీ ఎక్కడివరకూ వచ్చిందనే దాని కంటే ఆ జర్నీని ఎంత ఆనందిస్తున్నామనేది ముఖ్యం. చాలా కాలం ఇది చేయాలి, అది చేయాలనే పరుగులోనే ఉండిపోయాను. దీంతో జ్ఞాపకాలు ఉండేవి కాదు. దేనిని ఆస్వాదించే సమయం వుండేది కాదు. ఇప్పుడు అనుభూతి చెందాలని కోరుకుంటున్నాను. అందుకే దేని పై ఎక్కువ ఒత్తిడి తీసుకోను.

ఒకప్పుడు బడ్జెట్ పరిమితులు ఉండేవి. ఇప్పుడు మీ మార్కెట్ ఓపెన్ అయ్యింది. మీపై ఎంత బడ్జెట్ పెట్టడానికైన నిర్మాతలు సిద్ధంగా వున్నారు. ఈ ఫేజ్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు?
ఇదంతా ప్రేక్షకులు అభిమానం, ఆదరణ వారు చూపిన ప్రేమ వలన సాధ్యపడింది. ఇది ఖచ్చితంగా మన హార్డ్ వర్క్ వలన సంపాదించామని చాలా ఆనందంగా వుంది.

మీ మేజర్ సినిమా హిందీలో విడుదలైంది. అలాగే ఇప్పుడు చేస్తున్న రెండు సినిమాలు హిందీలో రాబోతున్నాయి. ఇకపై మీ సినిమాలన్నీ హిందీలో ఖచ్చితంగా విడుదలౌతాయా?
అది సినిమా సబ్జెక్ట్ బట్టి వుంటుంది. జి2 చాలా మ్యాసీవ్ ఫిల్మ్. ఐదు దేశాల్లో జరిగే కథ. ఆ స్కేల్ స్పాన్ కి హిందీ ఆడియన్స్ ఖచ్చితంగా నచ్చుతుందని నమ్మకం వుంది. శ్రుతి హాసన్ తో చేస్తున్న సినిమా ప్రోపర్ గా హిందీ, తెలుగు రెండు భాషల్లో సెపరేట్ గా షూట్ చేస్తున్నాం. కల్చర్ ప్రకారం ప్రతి సీన్ ట్రీట్మెంట్ కూడా డిఫరెంట్ గా వుంటుంది. నటీనటీనటుల ఎంపికలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. తెలుగు, హిందీ రెండు భాషలపై పట్టువున్న నటులని ఎంపిక చేశాం.

మీ చిత్రాలకు రచన విభాగంలో కూడా పాలుపంచుకున్నారు కదా. దర్శకత్వంలో మీ అన్వాల్మెంట్ ఏ మేరకు వుంటుంది ?
నేను గుడ్ యాక్టర్, గ్రేట్ రైటర్, బ్యాడ్ డైరెక్టర్ అని ఫీలౌతా. దర్శకుడికి చాలా ఓర్పు కావాలి. నేను ప్రతిది మనసుతో ఆలోచిస్తాను. అది నటుడిగా చేయాల్సిన పని. కానీ దర్శకుడు మెదడుతో అలోచించాలి. అదొక డిఫరెంట్ స్కిల్ సెట్. నేను యాక్టింగ్ రైటింగ్ ప్రిఫర్ చేస్తాను. నేను రాసే కథలు కూడా కేవలం నా కోసమే. ఇప్పుడు చేస్తున్న రెండు సినిమాల తర్వాత కేవలం నటుడిగానే మరో రెండు చిత్రాలు చేయబోతున్నాను.

రచయితే నటుడు కావడంలో వున్న సౌలభ్యం ఏమిటి ?
కొన్నిసార్లు రచయిత అలోచించాలా లేదా నటుడిగా అలోచించాలనే డైలమా వచ్చేస్తుంది. అందుకే కథ రాసినప్పుడు మనల్ని మనం నటుడిగా ఎప్పుడూ చూడకూడదు. కథకు ఏది అవసరమో అదే రాయాలి. పదేళ్ళుగా నాను నేను ఇలాంటి కసరత్తు చేసుకున్నాను. రాసిన సీన్ ని ఎలా చూపించాలనేది యాక్టర్ గా మాత్రమే అలోచించాలి. ఇలా విడిగా చూడటం నాకు చాలా నీట్ గా వుంటుంది.

గూఢచారి 1కి మరియు 2కి లింక్ ఉంటుందా ?
మీకో స్పాయిలర్ చెప్పేస్తా. గూఢచారి 2 మంచు కొండల్లో మొదలౌతుంది. ఈ సినిమాకి సీక్వెల్ కథ రాసుకున్నప్పుడే అనుకున్నాను. ఐతే ముందు ఆడియన్స్ మన సినిమాకి సీక్వెల్ కోరుకోవాలి. వాళ్ళు అడిగినప్పుడు అనౌన్స్ చేస్తే అందులో వున్న కిక్ వేరు.

సినిమాల ఎంపిక విషయంలో చాలా పర్టిక్యులర్ గా వుంటున్నారు. ఈమధ్య చాలా పెద్ద ఆఫర్ ని రిజెక్ట్ చేశారని తెలిసింది నిజమేనా ?
ఇండస్ట్రీలో డబ్బులైనా సంపాధించవచ్చు మంచి సినిమాలైన చేయొచ్చు. చాలా అరుదుగానే కొంతమందికే మంచి సినిమాలపై డబ్బు చేసుకోవడం కుదురుతుంది. నాకు మనీ మీద పెద్ద క్రేజ్ లేదు. ఫ్రెండ్స్ కూడా ఈ విషయంలో నన్ను తిడతారు. అందుకే సహజంగానే కేవలం మంచి సినిమాపైనే దృష్టి వెళ్ళిపోతుంది. నా దృష్టి ఎప్పుడూ సినిమా చూస్తున్న ఆడియన్స్ ఎలా ఫీలౌతారనే దానిపైనే వుంటుంది. సక్సెస్ వచ్చిన ఫెయిల్యూర్ వచ్చిన చాలా సెలక్టివ్ సినిమాలే చేస్తున్నాను.

శ్రుతి హాసన్ గారితో చేస్తున్న సినిమా ఎలా ఉండబోతుంది ?
వెరీ ఇంటెన్స్ యాక్షన్ లవ్ స్టొరీ. హైలీ ఎమోషనల్ యాంగ్రీ ఫిలిమ్. చాలా న్యూ జోనర్ ఫిల్మ్.

ఈ చిత్రంతో షానీల్ డియో దర్శకుడిగా పరిచయం చేయాలనే ఆలోచన మీదేనా ?
క్షణం షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ చూపించాడు. అది ఆల్రెడీ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఎంపికైయిందని కూల్ గా చెప్పాడు. తనలో అంత ప్రతిభ ఉందా అని సర్ప్రైజ్ అయ్యాం. తన లక్ష్యమే దర్శకత్వమని చెప్పాడు. అప్పటినుంచే తనని దర్శకుడి పరిచయం చేయాలని ఫిక్స్ అయ్యాం.

ఆల్ ది బెస్ట్ థాంక్యూ

సంబంధిత సమాచారం

తాజా వార్తలు