పూరికి రెండు నెలలు సెలవులు

Published on Jul 21, 2019 1:15 pm IST

దర్శకుడు పూరి జగన్నాథ్ అనుకున్నట్టే ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంతో హిట్ అందుకున్నారు. ఈ చిత్రం మూడు రోజులకే రూ.36 కోట్ల గ్రాస్ రాబట్టింది. దీంతో గత కొన్నాళ్లుగా ఒక ఫ్లాప్ తరవాత హడావుడిగా ఇంకో సినిమాను మొదలుపెట్టే పూరికి ఈసారి ఆ అవసరం లేకుండా పోయింది. ఎట్టకేలకు హిట్ దక్కింది కాబట్టి ఎన్నో ఏళ్లుగా హాలీడే లేకుండా పనిచేసిన అయన రెండు నెలల పాటు హాలీడే తీసుకోనున్నారు.

ఈ విషయాన్ని స్వయంగా తెలిపిన పూరి ఈ సెలవుల్లో వర్కవుట్స్ చేసి శరీరాకృతిని మార్చుకుని మళ్ళీ పాత పూరి మాదిరిగా హుషారుగా కనిపిస్తానని అంటున్నారు. ఇకపోతే పూరి తన తర్వాతి సినిమాగా ‘డబుల్ ఇస్మార్ట్’ చేస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. అంటే ఇంకో రెండు నెలల తరవాతే ఆయన కొత్త ప్రాజెక్ట్ స్టార్టవుతుందన్నమాట.

సంబంధిత సమాచారం :