‘సైలెన్స్’.. అనుష్కతో ఇద్దరు హీరోయిన్స్ !

Published on Jan 14, 2019 5:18 pm IST

‘భాగమతి’గా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ ని అందుకున్న అనుష్క.. కొంచం విరామం తీసుకుని ప్రస్తుతం హేమంత్ మధుకర్ దర్శకత్వంలో మాధవన్, సుబ్బరాజ్ ముఖ్య పాత్రల్లో థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘సైలెన్స్’ అనే సినిమాలో అనుష్క నటిస్తోన్న విషయం తెలిసిందే.

కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రంలో మరో ఇద్దరు యంగ్ హీరోయిన్స్ కూడా నటించనున్నారట. అంజలి మరియు షాలిని పాండే ఇద్దరూ సైలెన్స్ లో కీలక పాత్రల్లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలో యూ ఎస్ లో ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించనున్నారు.

గోపి సుందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం మార్చి నుండి షూటింగ్ ను జరుపుకోనుంది. సినిమాలో ఎక్కువ భాగం ఫారన్ లో జరిగే ఈ చిత్రాన్ని కోన ఫిలిం కార్పొరేషన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించనున్నాయి.

సంబంధిత సమాచారం :

More