జూన్ 15న విడుదల కానున్న ఉదయ్ కిరణ్ చివరి చిత్రం ఆడియో

జూన్ 15న విడుదల కానున్న ఉదయ్ కిరణ్ చివరి చిత్రం ఆడియో

Published on Jun 14, 2014 3:27 PM IST

Chitram-Cheppina-Katha
ఉదయ్ కిరణ్ ఆకస్మిక మరణం ప్రేక్షకులను షాక్ కి గురి చేసింది. ఉదయ్ కిరణ్ చివరి సారిగా నటించిన ‘చిత్రం చెప్పిన కథ’ ఆడియో జూన్ 15 న విడుదల కానుంది.

ఉదయ్ ఈ చిత్రంలో ఒక విభిన్న పాత్ర పోషించాడని ఈ చిత్రం బాగా రావడానికి ఎంతగానో కృషి చేసాడని నిర్మాతలు వెల్లడించారు. అయితే ఇది ఏ తరహా చిత్రమో తెలీదు.

ఉదయ్ కిరణ్ మేనేజర్ మున్నా నిర్మించిన ఈ చిత్రం ద్వారా మోహన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ చాలా రోజుల క్రితం విడుదల చేసారు. ఉదయ్ చివరి సారిగా నటించిన ఈ చిత్రం గుర్తుండిపోయే చిత్రం అవ్వాలని ఆశిద్దాం.

తాజా వార్తలు