ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో మంచి బజ్ అండ్ ప్రమోషన్స్ నడుమ వచ్చిన నోటెడ్ చిత్రాలు “ఉగ్రం” మరియు “రామబాణం” చిత్రాలు కూడా ఒకటి. మరి ఉగ్రం చిత్రంలో అల్లరి నరేష్ హీరోగా నటించగా తన హిట్ డైరెక్టర్ విజయ్ కనకమేడల దర్శకత్వం వహించాడు. అలాగే మ్యాచో స్టార్ గోపీచంద్ కూడా తన హిట్ దర్శకుడు శ్రీవాస్ తో చేసిన సినిమా “రామబాణం”.
మరి ఈ రెండు సినిమాలు ఒకొకటి ఒకో రకమైన టాక్ ని తెచ్చుకున్నాయి. ఇక ఈ టాక్ తో అయితే పి ఆర్ నంబర్స్ ప్రకారం నైజాంలో డే 1 వసూళ్లు చూసినట్టు అయితే రామబాణం 85 లక్షల గ్రాస్ ని 72 లక్షల నెట్ వసూళ్లు ఇది అందుకుంది. ఇక ఉగ్రం విషయంకి వస్తే 44 లక్షల గ్రాస్ ని వసూలు చేయగా 37 లక్షల నెట్ వసూళ్లు అందుకున్నట్టుగా తెలుస్తుంది. దీనితో అయితే ఈ రెండు చిత్రాలు కూడా డీసెంట్ వసూళ్లు అందుకున్నాయని చెప్పొచ్చు. ఇక వారాంతం వసూళ్లు ఎలా ఉంటాయో చూడాలి.
