ట్రైలర్ తో వచ్చిన ‘ఉండి పోరాదే’ !

Published on Aug 7, 2019 2:00 am IST

గోల్డ్ టైమ్ ఇన్ పిక్చర్స్ పతాకంపై శ్రీమతి సత్య ప్రమీల కర్లపూడి సమర్పణలో డాక్టర్ లింగేశ్వర్ నిర్మాతగా నవీన్ నాయని దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఉండి పోరాదే’. ఇటీవల రిలీజ్ అయిన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్ర ట్రైల‌ర్ రిలీజ్ కార్య‌క్ర‌మం ప్ర‌సాద్ ల్యాబ్ లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌ముఖ నిర్మాత రాజ్ కందుకూరి ముఖ్య అతిథిగా హాజ‌రై ఉండిపోరాదే ట్రైల‌ర్ ను విడుద‌ల చేశారు. ఈ సందర్భంగా… ప్ర‌ముఖ నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ – ఇక్క‌డ అంతా పాజిటివిటీ ఉంది. అలాగే ఈ స‌నిమా నిర్మాత డా.లింగేశ్వ‌ర్ గారికి చాలా మంచి ఫాలోయింగ్ ఉంది. చాలా మంది ఆయ‌న గైడెన్స్ తీసుకుంటారు. ఒక నిర్మాత‌గా ఆయ‌న 100 ప‌ర్సెంట్ స‌క్సెస్ కొడ‌తారు అనిపిస్తుంది. నేను ట్రైల‌ర్, పాట‌లు చూశాను. టెక్నిక‌ల్‌గా చాలా బాగుంది. ఏ సినిమాకైనా కంటెంట్ ముఖ్యం. సాబు వర్గీస్ అధ్బుతమైన మ్యూజిక్ తో పాటు మహావీర్ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాకు ఎప్పుడు ఎలాంటి అవ‌స‌రం వ‌చ్చినా త‌ప్ప‌కుండా నా స‌పోర్ట్ ఉంటుందిఅన్నారు.

నిర్మాత డా. కె లింగేశ్వర్ మాట్లాడుతూ – ” నేను గ‌తంలో చెప్పిన‌ట్టు సినిమా 100ప‌ర్సెంట్ స‌క్సెస్ అవుతుంది. అందుక‌నే ఈ సినిమా డిస్ట్రిబ్యూష‌న్ ఎవ‌రికీ ఇవ్వ‌లేదు.. నేనే ఓన్ చేయాలి అనే ఆలోచ‌న‌లో ఉన్నాను. ఈ సినిమాలో అంద‌రూ కొత్త‌వారే.. అయినా అంత ధైర్యం ఎందుకంటే అది క‌థ‌. సినిమా క‌థ‌ను నేను అంత‌లా న‌మ్మాను. లాస్ట్ 20 మినిట్స్ లో మన ప‌క్క‌న ఉన్న‌వారిని కూడా మ‌ర్చి పోయేలా సినిమా ఉంటుంది. మ‌న ఇంట్లో వారు ఎలా ఉంటారు. వారి బందాలు మ‌న జీవితంలో ఎలాంటి ప్ర‌భావం చూపిస్తాయి అనే అద్భుత‌మైన క‌థాంశంలో తెర‌కెక్కించారు ద‌ర్శ‌కుడు న‌వీన్. ఈ సినిమాలో న‌టించిన అంద‌రి కెరీర్లో ఇది బెస్ట్ మూవిగా నిలిచిపోతుంది. అంద‌రూ సినిమా చూసి మా సినిమాను పెద్ద స‌క్సెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను అన్నారు.

సంబంధిత సమాచారం :