ట్రైలర్: ఉండిపోరాడే-టీనేజ్ లవ్

Published on Aug 6, 2019 1:02 am IST

నూతన నటులు తరుణ్ తేజ్,లావణ్య జంటగా డాక్టర్ లింగేశ్వర్ నిర్మాతగా,నవీన్ నాయని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “ఉండిపోరాడే”. ఈ చిత్ర ట్రైలర్ నేడు విడుదల చేయడం జరిగింది. ట్రైలర్ చుస్తే కామెడీ,లవ్ ఎమోషన్స్ ప్రధానంగా తెరకెక్కినట్లు అర్థం అవుతుంది.

టీనేజ్ లో ఉన్న ఒక అమ్మాయి,అబ్బాయి మధ్య కలిగే ప్రేమ,దాని వలన వారు ఎదుర్కొనే సమస్యలు ప్రధాన కథాంశంగా ఈ చిత్రం తెరకెక్కినట్లుంది. చిన్న వయసులోనే ప్రేమ కోసం తపించే పిల్లల, భవిష్యత్ కొరకు పెద్దల ఆంక్షల సమాహారమే ఈ చిత్రం. ఏది ఏమైనా “ఉండిపోరాడే” ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. దాదాపు అందరూ నూతన నటులతో నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.

వీడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :