ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ మూడు భారీ చిత్రాల్లో బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తో తీయనున్న భారీ ఇతిహాస చిత్రం “ఆదిపురుష్” కూడా ఒకటి. ప్రస్తుతం రాధాకృష్ణతో తీస్తున్న పాన్ ఇండియన్ చిత్రం “రాధే శ్యామ్” అయ్యిన వెంటనే డార్లింగ్ దీనిని మొదలు పెట్టనున్నాడు. ఇక ఇదిలా ఉండగా భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఆదిపురుష్ టీం నుంచి ఊహించని విధంగా ఓ ప్రకటన వచ్చింది. స్పెషల్ డేస్ ను వదిలి నార్మల్ గా వీరు అప్డేట్స్ వదులుతుండడం గమనార్హం.
అలా ఈరోజు ఉదయం ఒక బిగ్ అనౌన్స్మెంట్ ఉందని ప్రకటించడంతో అదేమిటా అని అంతా ఇపుడు ఎదురు చూస్తున్న తరుణంలో మేకర్స్ ఆ బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్ ను ప్రకటించేసారు. ఈ అప్డేట్ లో ఏకంగా ఈ చిత్రం విడుదల తేదీనే ఇచ్చేసారు.. వచ్చే 2022వ సంవత్సరం ఆగష్టు 11 వ తేదీన ఈ చిత్రం విడుదల చేస్తున్నట్టుగా దర్శకుడు ఓంరౌత్ ఫిక్స్ చేసేసారు.
ఇది మాత్రం ఊహించని అప్డేట్ అనే చెప్పాలి. ఏ హీరోయిన్ కోసం లేదా మరో చిన్న అప్డేట్ ఇస్తారేమో అనుకున్నారు కానీ ఇది మాత్రం ఊహించి ఉండరు. మొత్తానికి మాత్రం ఓంరౌత్ ఈ సినిమా విషయంలో పక్కా క్లారిటీగా ఉన్నారని చెప్పాలి. ఈ చిత్రంలో ప్రభాస్ రాముని పాత్రలో కనిపిస్తుండగా సైఫ్ అలీఖాన్ రావణ పాత్రలో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో 3డి లో తెరకెక్కించనున్నారు.
#Adipurush in theatres 11.08.2022#Prabhas #SaifAliKhan #BhushanKumar @vfxwaala @rajeshnair06 @TSeries @retrophiles1 #TSeries pic.twitter.com/EL4WZUkyni
— Om Raut (@omraut) November 19, 2020


