“రాధే శ్యామ్”కు అస్సలు ఊహించని మ్యూజిక్ కంపోజర్.!

Published on Oct 20, 2020 4:00 pm IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ చిత్రం “రాధే శ్యామ్”. జిల్ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. అయితే ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే ఈ అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు కావడంతో ఈ చిత్ర యూనిట్ ఒక “బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్” అని మోషన్ పోస్టర్ ను విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు.

అయితే ఇవన్నీ బాగానే ఉన్నా ఒక ఫ్యాక్టర్ మాత్రం అలా సస్పెన్స్ గానే ఇన్ని రోజులూ నిలుస్తూ వచ్చింది. అదే ఈ చిత్రానికి సంగీతం ఎవరు అందిస్తున్నారు అన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. ఈ ఒక్క అంశంపై ఎన్నో రకాల స్పెక్యులేషన్స్ వచ్చాయి కానీ ఇప్పుడు ఒక ఫైనల్ కంక్లూజన్ వచ్చింది. ఈ చిత్రానికి అసలు ఎవరూ ఊహించని మ్యూజిక్ డైరెక్టర్ సంగీతం ఇవ్వనున్నాడు. అతడే యంగ్ అండ్ టాలెంటెడ్ మ్యూజిక్ కంపోజర్ జస్టిన్ ప్రభాకర్.

ఈ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ మన తెలుగులో రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన “డియర్ కామ్రేడ్” కు మాత్రమే కంపోజ్ చేసాడు. కానీ మళయాళం మరియు తమిళ్ లో ఎన్నో చిత్రాలకు మంచి మ్యూజిక్ ను అందించాడు. మరి ఇప్పటి వరకు ఒక పాన్ ఇండియన్ సినిమాకు కూడా సంగీతం ఇవ్వని ఈ దర్శకుడుపై ఎంత నమ్మకం లేకపోతే ఇలాంటి తరహా ప్రాజెక్ట్ ను అందించి ఉంటారో అర్ధం చేసుకోవచ్చు. ఇది మాత్రం ఇండస్ట్రీ వర్గాలు ఊహించని కాంబోనే అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :

More