రాజమౌళా మజాకా…! ఒక్క ఛాన్స్ తో సూపర్ ఫేమస్ చేశాడు

Published on Nov 21, 2019 10:00 pm IST

కొన్ని కొన్ని దక్కాలంటే అదృష్టం ఉండాలి. కొందరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అందనివి…కొందరికి అసలు ప్రయత్నం చేయకుండానే ఒడిలో వచ్చి చేరుతాయి. అలాంటి వారిని చూపి మిగతా వాళ్ళు అసూయ పడటమే తప్పా, ఏమి చేయలేరు. రాజమౌళి సినిమాలో అవకాశం కూడా అలాంటిదే. ఆ అదృష్టమే ఒలీవియా మోరిస్ కి దక్కింది. ఇప్పుడు ఆమె ఇండియా మొత్తం ఫేమస్. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్ హీరోయిన్ ఎవరంటే…, ఒలీవియా అనేంతగా ఒక్కరోజులో ప్రాచుర్యం పొందింది.

మోడల్ గా రాణిస్తున్న ఒలీవియా కేవలం స్టేజ్ ఆర్టిస్ట్. అంతగా పేరున్న నటికూడా కాదు. ఆర్ ఆర్ ఆర్ ప్రకటన వరకు ఆమె ట్విట్టర్ ఫాలోవర్స్ కనీసం మూడువేలు కూడా లేదంటే ఆమె పాపులారిటీ ఏమిటో తెలుసుకోవచ్చు. ఇక నిన్న రాజమౌళి ప్రకటన తరువాత ట్విట్టర్ లో ఆమె ఫాలోవర్స్ సంఖ్య దాదాపు 17000లకు చేరింది. అలాంటి నటి ఇలాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ లో అవకాశం దక్కించుకొని ఫుల్ ఫేమస్ ఐయ్యింది.

సంబంధిత సమాచారం :

More