చరణ్, శంకర్ ల బిగ్ ప్రాజెక్ట్ కి ఊహించని ట్విస్ట్.!

Published on Sep 3, 2021 11:01 am IST


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్ “రౌద్రం రణం రుధిరం” చిత్రాన్ని కంప్లీట్ చేసిన సంగతి తెలిసిందే. మరి దీనితో పాటుగా మరో క్రేజీ మల్టీ స్టారర్ “ఆచార్య” కూడా ఫైనల్ స్టేజ్ లో ఉంది. అయితే ఈ భారీ చిత్రం అనంతరం పాన్ ఇండియన్ సెన్సేషనల్ దర్శకుడు శంకర్ తో అనౌన్స్ చేసిన సినిమా కూడా లైన్ లో ఉంది. మరి ఇది అనౌన్స్ చేసిన నాటి నుంచే భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రంకి ఇప్పుడు ఊహించని ట్విస్ట్ ఎదురయ్యినట్టు ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వైరల్ అవుతుంది.

ఇప్పటికే శంకర్ చుట్టూతా పలు కాంట్రవర్సీలు వెంటాడుతున్నాయి అది చాలదు అన్నట్టుగా ఇప్పుడు ఈ కొత్త సినిమా కథ నాది అంటూ తమిళనాట ఓ రైటర్ అక్కడి మూవీ రైటర్ యూనియన్ లో కంప్లైంట్ రైజ్ చేసినట్టుగా తెలుస్తుంది. దీనితో ఇప్పుడు కొత్త ట్విస్ట్ ఏర్పడింది. సినిమా కథ నాది అని దానినే కార్తీక్ సుబ్బరాజ్, శంకర్ లు చరణ్ తో సినిమాగా చేస్తున్నారని అందులో ఫిర్యాదు అట.. మరి దీనిలో ఇంకా ఎంతమేర నిజం ఉందొ తెలియాల్సి ఉంది. ఇంకా దీనిపై ఎప్పుడు క్లారిటీ వస్తుందో కూడా చూడాలి.

సంబంధిత సమాచారం :