హైదరాబాద్ వీధుల్లో తిరుగుతున్నబెల్లంకొండ శ్రీనివాస్.

Published on Jun 11, 2019 2:27 pm IST

తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ కాజల్ జోడిగా “సీత” మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఆ సినిమా ఫలితం ఎలా ఉన్నా శ్రీనివాస్ వరుసబెట్టి సినిమాలు చేస్తూ పోతున్నాడు. అనుపమ పరమేశ్వరన్ తో చేసిన “రాక్షసుడు” క్రైమ్ థ్రిల్లర్ జులై 18 విడుదలకు సిద్ధం అవుతుండగా, గజ దొంగ “టైగర్ నాగేశ్వరరావు” బయో పిక్ లో కూడా నటించనున్నాడు. నేడు కారులో విలాసవంతమైన ప్రయాణాన్ని వదిలేసి సాధారణ పౌరుడిలా హైదరాబాద్ నగరంలో చక్కర్లు కొట్టాడు ఈ యాక్షన్ హీరో.

ఆర్ టి సి బస్సులో,మెట్రో ట్రైన్లో,బైక్ పై తాను తిరిగిన పోటోలను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.” హైదరాబాద్ విధులలో తిరుగుతూ కొంచెం కొత్తగా ఫొటోలు ప్రయత్నించాను, హైద్రాబాద్లో పెరిగిన వాడిగా ప్రజలు రోజు తమ విధులకు హాజరుకావడానికి ఉపయోగించే వివిధ ప్రయాణసాధనాలను చూశాను” అంటూ పోస్ట్ చేశారు. ఈ ఫోటోలలో చాలా నాచురల్ గా ఉన్నాడు సాయి శ్రీనివాస్. పెద్ద ప్రొడ్యూసర్ కొడుకు అలాగే హీరో కూడా అయిన శ్రీనివాస్ ఇలా ఎండలో హైదరాబాద్ రోడ్లపై తిరగడం ఆశ్చర్యం కలిగించే విషయమే.

సంబంధిత సమాచారం :

More