నందమూరి కళ్యాణ్ రామ్,తమన్నా జంటగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘నా నువ్వే’. విడుదలకు సమయం దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమా ప్రచారం కోసం వినూత్నంగా 400 క్యాబ్స్ ని ఉపయోగిస్తున్నారు . 400 క్యాబ్స్ ఫైన ‘నా నువ్వే ‘మూవీ పోస్టర్స్ దర్శనమివ్వనున్నాయి.
తమిళ దర్శకుడు జయేంద్ర దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను మహేష్ కోనేరు, విజయ్ వట్టికూటి, కిరణ్ ముప్పవరపులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శరత్ ఈ చిత్రానికి సంగీతమందించారు . ఈ నెల 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.
