సీనియర్ నటి గౌతమి ఇంట్లోకి ప్రవేశించి న్యూసెన్స్ చేసిన వ్యక్తి

సీనియర్ నటి గౌతమి ఇంట్లోకి ప్రవేశించి న్యూసెన్స్ చేసిన వ్యక్తి

Published on Nov 18, 2020 8:02 PM IST

Gauthami

సీనియర్ నటి గౌతమి ఇంట్లోకి అపరిచిత వ్యక్తి ప్రవేశించి భయభ్రాంతులకు గురిచేశాడు. వివరాల్లోకి వెళితే నిన్న మంగళవారం చెన్నైలోని కొట్టివాక్కమ్‌లోని గౌతమి నివాసం ఉంటున్న ఇంట్లోకి పాండియన్ అనే వ్యక్తి ప్రవేశించి గోడ వెనక నక్కి ఉండటంతో అనుమానం వచ్చిన ఇంట్లోని వ్యక్త్యులు పోలీసులకు సమాధానం ఇచ్చారట. సదరు వ్యక్తి పొంతనలేని సమాధానాలు ఇవ్వడం, అనుమానాస్పదంగా కనిపించడంతో ఇంట్లోని వారు గురయ్యారు.

కంప్లైంట్ అందుకున్న పోలీసులు సదరు వ్యక్తిని విచారించగా తన పేరు పాండియన్ అని మాత్రమే చెప్పిన ఆ అపరిచితుడు గౌతమి ఇంట్లోకి ఎందుకు వెళ్ళింది మాత్రం చెప్పలేదట. పైగా అతను మద్యం మత్తులో ఉండటంతో పోలీసులు అతని మీద అనుమతి లేకుండా ఇంట్లోకి ప్రవేశించడంతో పాటు న్యూసెన్స్ క్రియేట్ చేసినందుకు పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేసి అరెస్ట్ చేశారు. అరెస్టైన కాసేపటికి అతను బెయిల్ మీద విడుదలయ్యాడట. ఊహించని ఈ పరిణామంతో గౌతమి ఇంట్లోని వారు భాయాందోళనలకు గురయ్యారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు