ఉపాసన ముందడుగు.. అందరికీ భరోసా

Published on Jan 28, 2021 9:00 pm IST

సామాజిక కార్యక్రమాల్లో రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల ఎప్పుడూ ముందుంటారు. అపోలో లైఫ్ విభాగాన్ని నడిపిస్తూనే బీ పాజిటివ్ అనే మ్యాగజైన్ కు ఎడిటర్ బాధ్యతలు కూడ చూసుకుంటున్న ఆమె తరచూ సామాజిక అవగాహన కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ ఉంటారు. లాక్ డౌన్ సమయంలో కరోనాను ఎదుర్కోవడం ఎలా, వైరస్ సోకితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి లాంటి విషయాల మీద సమగ్ర సమాచారం అందించిన ఆమె ఇప్పుడు వ్యాక్సినేషన్ మీద కూడ అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.

వ్యాక్సిన్ అయితే వచ్చింది కానీ దాన్ని తీసుకుంటే ఏదో అవుతుందనే భయం మాత్రం కొందరు ప్రజల్లో ఉంది. అందుకే ఉపాసన ఈరోజు హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో తానే స్వయంగా వ్యాక్సిన్ వేయించుకుని ముందడుగు వేశారు. వ్యాక్సినేషన్ మీద ఎలాంటి అపోహలు, భయాలు పెట్టుకోవద్దని, ప్రజలంతా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. ఉపాసన వేసిన ఈ ముందడుగు సామాన్య జనంలో వ్యాక్సినేషన్ పట్ల నమ్మకం ఏర్పడటానికి దోహదపడవచ్చు.

సంబంధిత సమాచారం :