‘ఓటీటీ’ : ఈ వారం అలరించే చిత్రాలివే !

Published on Apr 11, 2022 3:21 pm IST

భారీ సినిమాలు అన్నీ ఇప్పటికే థియేటర్స్ లో వరుసగా రిలీజ్ అయిపోతున్నాయి. అలాగే ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో చిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి ఉత్సాహ పడుతున్నాయి. ఓటీటీలలో విడుదల అవుతున్న పలు చిత్రాల పై కూడా ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.

కాబట్టి, ఈ క్రమంలో ఈ వారంలో కూడా ఓటీటీలో పలు చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు రిలీజవుతున్నాయి. మరి వాటి పై ఓ లుక్కేద్దాం.

ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

 

ఈ వారం సోనీలివ్‌ లో ప్రసారం అవుతున్న సినిమా :

ఆడవాళ్లు మీకు జోహార్లు ఏప్రిల్‌ 14 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

ఈ వారం ఎంఎక్స్‌ ప్లేయర్‌ లో ప్రసారం అవుతున్న సినిమా :

దహనం ఏప్రిల్‌ 14వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

ఈ వారం జీ 5 లో ప్రసారం అవుతున్న సీరీస్ :

గాలివాన (వెబ్‌సెరిస్‌) ఏప్రిల్‌ 14వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

ఈ వారం ఆహాలో ప్రసారం అవుతున్న సినిమా :

బ్లడీ మేరీ ఏప్రిల్‌15 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సంబంధిత సమాచారం :