థియేటర్‌/ఓటీటీ : ఈ వారం చిత్రాలివే!

థియేటర్‌/ఓటీటీ : ఈ వారం చిత్రాలివే!

Published on Apr 8, 2024 12:30 PM IST

ఈ ఏప్రిల్‌ రెండో వారంలో సినీ ప్రేక్షకులను అలరించడానికి థియేటర్ రిలీజ్ కి చాలా సినిమాలు రెడీ అయ్యాయి. అలాగే, ఓటీటీల్లో చాలా చిత్రాలు స్ట్రీమింగ్‌ కి రెడీ అయ్యాయి. ఓటీటీల పై ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి ఈ వీక్ సందడి చేసేందుకు రాబోతున్న ఓటీటీ & థియటర్స్ చిత్రాల పై ఓ లుక్కేద్దాం.

థియేటర్స్ లో రిలీజవుతున్న చిత్రాలు ఇవే.

‘మైదాన్‌’ :

బాలీవుడ్‌ కథానాయకుడు అజయ్‌ దేవగణ్‌ భారత ఫుట్‌బాల్‌ దిగ్గజ కోచ్‌ సయ్యద్‌ అబ్దుల్‌ రహీంగా నటించిన చిత్రమే ‘మైదాన్‌’. ఏప్రిల్‌ 10న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

‘బడేమియా ఛోటేమియా’ :

బాలీవుడ్‌ కథానాయకులు అక్షయ్‌కుమార్‌, టైగర్‌ ష్రాఫ్‌ కలిసి నటించిన చిత్రం ‘బడేమియా ఛోటేమియా’ కూడా ఏప్రిల్‌ 10న థియేటర్‌లలో రిలీజ్ కానుంది.

గీతాంజలి :

అంజలి ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. ఏప్రిల్‌ 11న ఈ మూవీ తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది.

‘లవ్‌ గురు’ :

విజయ్‌ ఆంటోనీ కథానాయకుడిగా నటిస్తూ, స్వయంగా నిర్మిస్తున్న చిత్రమే ‘లవ్‌ గురు’. రంజాన్‌ సందర్భంగా ఏప్రిల్‌ 11న చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

నెట్‌ఫ్లిక్స్‌ :

అన్‌లాక్డ్‌ (వెబ్‌సిరీస్) ఏప్రిల్‌ 10 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

వాట్‌ జెన్నీఫర్‌ డిడ్‌ (ఇంగ్లీష్‌) ఏప్రిల్‌ 10 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

బేబీ రెయిన్‌డీర్‌ (హలీవుడ్‌) ఏప్రిల్ 11 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

హార్డ్‌బ్రేక్‌ హై (వెబ్‌సిరీస్‌2) ఏప్రిల్‌ 11 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

అమర్‌సింగ్‌ చమ్కీలా (హిందీ) ఏప్రిల్‌ 12 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

అమెజాన్‌ ప్రైమ్‌ :

ఫాలౌట్‌ (వెబ్‌సిరీస్‌) ఏప్రిల్‌ 12 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

జీ5 :

గామి (తెలుగు) ఏప్రిల్‌ 12 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

డిస్నీ+హాట్‌స్టార్‌ :

బ్లడ్‌ ఫ్రీ (కొరియన్‌) ఏప్రిల్‌ 10 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ప్రేమలు (మలయాళం) ఏప్రిల్‌ 12 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ది గ్రేటెస్ట్‌ హిట్స్‌ (హాలీవుడ్‌) ఏప్రిల్‌ 12 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సోనీలివ్‌ :

అదృశ్యం (హిందీ సిరీస్‌) ఏప్రిల్‌ 11 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఆహా :

కార్తీక (తెలుగు) ఏప్రిల్‌ 09 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ప్రేమలు (తెలుగు) ఏప్రిల్‌ 12 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

లయన్స్‌ గేట్‌ప్లే :

హైటౌన్‌ (వెబ్‌సిరీస్‌) ఏప్రిల్‌ 12 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సన్‌ నెక్ట్స్‌ :

లాల్‌ సలామ్‌ (తమిళ/తెలుగు) ఏప్రిల్‌ 12వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు