అఖిల్ సినిమా గురించి ఆసక్తికరమైన వార్త ?

Published on Aug 29, 2018 12:13 am IST


అక్కినేని వారి యువ నటవారసుడు ప్రస్తుతం నటిస్తున్న మూడవ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం ఒక వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే అయన ప్రస్తుతం, ఇటీవల తొలిప్రేమతో మంచి హిట్ అందుకున్న వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఒక చిత్రంలో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. గత కొద్ది రోజులుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని రేపు, నాగార్జున బర్త్ డే సందర్భంగా విడుదల చేయనుందట చిత్ర యూనిట్. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్ర టైటిల్ ని మిస్టర్ మజ్ను గా ఫిక్స్ చేసారని, అంతే కాకా టైటిల్ తో పాటు ఒక సాంగ్ టీజర్ ని కూడా యూనిట్ రేపు విడుదల చేయనుందట.

ఈ వార్త నిజమే అయితే ఇక అక్కినేని అభిమానులకు పండుగే అని చెప్పుకోవాలి. ఇక తొలి చిత్రం అఖిల్ తో ప్లాప్ చవిచూసిన అఖిల్, ఆ తరువాత విక్రమ్ కే కుమార్ తో చేసిన హలో చిత్రంతో యావరేజ్ హిట్ కొట్టాడు. కాగా అక్కినేని అభిమానులు ఈ చిత్రం పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మరి ఇన్ని ఆశలు పెట్టుకున్న అఖిల్-3 రేపు విడుదల తరువాత ఆయనకు ఎటువంటి విజయాన్ని అందుకుంటాడో తెలియాలంటే మరికొన్నాళ్లు వేచిచూడాల్సిందే …

సంబంధిత సమాచారం :

X