‘డీజే’ విడుదల తేదీని అప్పుడే ప్రకటిస్తారట!
Published on Jan 30, 2017 9:56 pm IST


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు హరీష్ శంకర్‌ల కాంబినేషన్‌లో రూపొందుతోన్న ‘డీజే- దువ్వాడ జగన్నాథం’ అనే సినిమా కొద్దికాలంగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే 50%పైనే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్‌తో దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుండగా, ఫస్ట్‌లుక్, విడుదల తేదీల విషయమై ఓ సమాచారం అందింది.

మొదట ఫస్ట్‌లుక్ రెడీ అయ్యాక, ఫస్ట్‌లుక్‌కు ఒక తేదీ నిర్ణయించి, ఆ తర్వాతే విడుదల తేదీని ప్రకటిస్తారట. ఈ ఫస్ట్‌లుక్ త్వరలోనే విడుదలవుతుందని తెలిపిన టీమ్, ఎప్పుడన్నది మాత్రం స్పష్టం చేయలేదు. హరీష్ శంకర్ స్టైల్లోనే యాక్షన్ కామెడీగా తెరకెక్కుతోన్న ‘డీజే’కు అల్లు అర్జున్ క్యారెక్టరైజేషన్ మేజర్ హైలైట్‌గా నిలుస్తుందని సమాచారం. సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తోన్న ఈ సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తున్నారు.

 
Like us on Facebook