జెర్సీ రిలీజ్ డేట్ మారనుంది !

Published on Feb 12, 2019 8:58 am IST

న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా ‘జెర్సీ’ ఏప్రిల్ 19న విడుదల కానుందని మేకర్స్ ఇటీవల అధికారంగా ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ విడుదల తేదీ ను మార్చనున్నారని కంఫర్మ్ అయ్యింది. తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో విడుదల తేదీ కి బదులు ఏప్రిల్ లో విడుదల అని వుంది. సో దాన్ని బట్టి ఈ చిత్ర రిలీజ్ డే ఇంకా ఫిక్స్ కాలేదని తెలుస్తుంది. ఇక ఈ చిత్రాన్ని ఏప్రిల్ 5 న కాని లేదా 12 కాని విడుదల చేయనున్నారట. అయితే ఏప్రిల్ 5 న నాగ చైతన్య నటిస్తున్న ‘మజిలీ’ ,12న సాయి ధరమ్ ‘చిత్రలహరి’ ఇప్పటికే బెర్తులను ఖరారు చేసుకున్నాయి. మరి ఈ రెండు చిత్రాలతో ఏ సినిమా కు పోటీగా జెర్సీ ని విడుదలను చేస్తారో చూడాలి. త్వరలోనే ఈ విడుదల తేదీ ఫై క్లారిటీ రానుంది.

క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈచిత్రంలో నాని మిడిల్ ఏజ్డ్ క్రికెటర్ గా కనిపించనుండగా కన్నడ బ్యూటీ శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తుంది. ‘మళ్ళీరావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటెర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవి చంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఈచిత్రంలోని మొదటి సాంగ్ ను ఈనెల 14న విడుదలచేయనున్నారు.

సంబంధిత సమాచారం :