మహర్షి షూటింగ్ అప్డేట్ !

మహర్షి షూటింగ్ అప్డేట్ !

Published on Dec 13, 2018 3:49 AM IST


‘భరత్ అనే నేను’ చిత్రం తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న25వ చిత్రం ‘మహర్షి’ షూటింగ్ గత 20రోజులుగా హైద్రాబాద్లోని రామోజీ ఫిలిం సిటీ లో వేసిన భారీ విలేజ్ సెట్ లో జరుగుతుంది. ఈ లాంగ్ షెడ్యూల్ మరో 14రోజుల్లో పూర్తి కానుందని సమాచారం. ప్రస్తుతం ఈ షెడ్యూల్ లో సినిమాలోని సెకండ్ హాఫ్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా అల్లరి నరేష్ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఆయన పాత్ర సినిమాకు కీలకం కానుంది. ఈ షెడ్యూల్ తో చిత్రీకరణ దాదాపుగా పూర్తి అయినట్లే.

వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు , అశ్వినీ దత్ , పీవీపీ లు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు