కొత్త సినిమాకు రెడీ అవుతున్న యువహీరో !

Published on Mar 5, 2019 8:29 am IST

గత ఏడాది రంగుల రాట్నం, రాజుగాడు ,లవర్ సినిమాలతో ప్రేక్షకులముందుకు వచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్ ఆ మూడింటితో హ్యాట్రిక్ పరాజయాలను ఖాతాలో వేసుకున్నాడు. ఇక లవర్ తరువాత కొంత గ్యాప్ తీసుకున్న రాజ్ తరుణ్ తన కొత్త చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నాడు. ‘అడుమగాడ్రా బుజ్జి’ ఫేమ్ కృష్ణా రెడ్డి తెరకెక్కించనున్న ఈ చిత్రం మార్చి మూడో వారంలో సెట్స్ మీదకు వెళ్లనుంది.

ఈ చిత్రానికి ‘నీది నాది ఒకటే లోకం’ అనే టైటిల్ ప్రచారంలో వుంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు.
మరి ఇటీవల వరుస పరాజయాలతో సతమతం అవుతున్న రాజ్ తరుణ్ కి ఈచిత్రమైన విజయాన్ని అందిస్తుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :

More