సాహో లేటెస్ట్ అప్డేట్స్ !

Published on Oct 23, 2018 4:48 pm IST


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘సాహో’ చిత్రం షూటింగ్ ఇప్పటివరకు 60శాతం పూర్తయింది. త్వరలోనే మిగితా చిత్రీకరణ ను పూర్తి చేసి సినిమాను వచ్చే ఏడాది ద్వితీయార్థంలో విడుదలచేయనున్నారట. ఇక ఈ రోజు విడుదలైన ఈ చిత్రం యొక్క మేకింగ్ వీడియో కి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ టీజర్ సినిమాఫై వున్నా అంచనాలను రెట్టింపు చేసింది.

‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శంకర్ ఎహసాన్ లాయ్ సంగీతం అందిస్తున్నారు. హాలీవుడ్ చిత్రాలకు దీటుగా భారీ వీఎఫ్ఎక్స్ తో రానుంది. ఇక ప్రభాస్ ఈ చిత్ర షూటింగ్ కు విరామం ఇచ్చి పాటు ప్రస్తుతం తన 20వ చిత్రంలోను నటిస్తున్నాడు. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈచిత్రం ఇటలీ లో షూటింగ్ జరుపుకుంటుంది.

సంబంధిత సమాచారం :