వివిఆర్ ఇంటర్వెల్ ఫైట్ మెగా అభిమానులకు ట్రీట్ ఇవ్వనుందట !

వివిఆర్ ఇంటర్వెల్ ఫైట్ మెగా అభిమానులకు ట్రీట్ ఇవ్వనుందట !

Published on Dec 10, 2018 3:45 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , మాస్ డైరక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న మొదటి చిత్రం ‘వినయ విధేయ రామ’ ఫై అంచనాలు భారీ స్థాయిలో వున్నాయి. టైటిల్ చూస్తే క్లాస్ గా వుంది కానీ ఈ చిత్రంలో పూర్తిగా మాస్ ఎలిమెంట్స్ ఉండేలా ప్లాన్ చేశాడట బోయపాటి. ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు వచ్చే ఫైట్ సినిమాకు హైలైట్ అవ్వనుందని సమాచారం. 500 మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొన్న ఈ ఫైట్ మెగా అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇవ్వనుందట. ఇక ప్రస్తుతం ఈచిత్రం యొక్క షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇంకా ఒక్క షెడ్యూల్ మాత్రమే బ్యాలెన్స్ వుంది.

అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటెర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రశాంత్ , ఆర్యన్ రాజేష్ , స్నేహ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. దే వి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని దానయ్య డివివి నిర్మిస్తున్న ఈచిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు