అమెరికాలో కూడా ఉపేంద్ర “ఐ లవ్ యూ”…!

Published on Jul 16, 2019 8:29 am IST

ఏ,ఉపేంద్ర,రా వంటి చిత్రాలతో టాలీవుడ్ లో కూడా మంచి మార్కెట్ పెంచుకున్న కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర సినిమాలు కొంత కాలంగా తెలుగులో రావడం చాలా అరుదైఆపోయింది. అల్లు అర్జున్ హీరోగా 2016లో వచ్చిన “సన్ ఆఫ్ సత్యమూర్తి” సినిమాలో ఉపేంద్ర ఓ కీలకపాత్ర చేయడం జరిగింది. ఐతే ఇటీవల ఆయన “ఐ లవ్ యూ” అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ తో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ఐతే ఈ చిత్రం కన్నడలో పర్వాలేదు అనిపించినా తెలుగులో మాత్రం నిరాశపరిచింది. దర్శకుడు ఆర్. చంద్రు తెరకెక్కించిన ఈ చిత్రంలో రచితా రామచంద్రన్ హీరోయిన్ గా నటించారు.

కాగా తాజాగా ఈ చిత్రాన్ని అమెరికాలో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని నటుడు ఉపేంద్ర తెలియపరిచారు. ఇండియాలో తెలుగు,కన్నడ భాషలలో విడుదలైన ఈ చిత్రాన్ని యూఎస్ లో విడుదల చేయలేదు. ఐతే ఇప్పుడు తెలుగు,కన్నడ భాషలలో అక్కడ ఈ నెల 19న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. మరి యూఎస్ లో ఉపేంద్ర “ఐ లవ్ యూ” చిత్రం ఎంత వరకు విజయం సాధిస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :

X
More